గ్రామాలకు రక్షణగా ఉంటున్న ఆర్.యం.పీలకు వాక్సిన్ ఏది?

0
332

గ్రామాలకు రక్షణగా ఉంటున్న ఆర్.యం.పీలకు వాక్సిన్ ఏది?

తాజాకబురు డెస్క్: కరోనా కష్టకాలం ఆరంభమై సంవత్సరం దాటింది,మొదటి వే లో జనతా కర్ఫ్యూ విధించిన కేంద్ర ప్రభుత్వం సెకండ్ వే లో రాష్ట్ర,కేంద్రాలు ఆలస్యంగా స్పందించాయి,దరిమిల ఎందరో ప్రాణాలను బలిగొన్నాయి,కరోనాతో పోరాడుతున్న ఫ్రంట్ వారియర్స్ ను ప్రభుత్వం ప్రకటించి వాళ్లకు వాక్సినేషన్ ప్రారంభించింది, అయితె కొన్ని కార్పోరేట్ ఆసుపత్రి లు ఈ సెకండ్ వే ను ఆసరాగా చేసుకొని లక్షలు దండుకుంటె, గ్రామాల్లోని ఆర్.యంపిలు మాత్రం ఈ విపత్కర పరిస్థితి లో కూడా ప్రజలకు ప్రాథమిక చికిత్స అందించారు,దాంతోపాటు ప్రజల భయాలను తొలగించారు,ఈ సెకండ్ వే కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా కరోనా కేసులు పెరిగాయి,దాంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలన్న భయపడి ఇంట్లో ఉన్నవాళ్లకు వ్యాధి పట్ల అవగాహాన కల్పించి ఎంతోమందిని పరీక్షలకు పంపించిన సందర్బాలు ఉన్నాయి, అయితె మిగితా సమయంలో ఎలా ఉన్న ఈ సెకండ్ వే లో మాత్రం ఆర్.యంపి వైద్యులు మాత్రం తమ శాయశక్తుల కృషి చేశారనటంలో ఎలాంటి సందేహాం లేదు,ఇలా ప్రజలకు నేరుగా వైద్యం అందిస్తున్న ఆర్.యంపి లకు ఇప్పటికి వాక్సినేషన్ పట్ల ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు..

మొదటగా ఫ్రంట్ వారియర్స్, ఈ మద్య కాలంలో కరోనా స్పైడర్ వారియర్స్ గా కొన్నింటిని చేర్చి వాళ్లకు వాక్సినేషన్ ప్రారంభించింది,కానీ నిత్యం ప్రజల్లొ ఉంటు సేవలను అందిస్తున్న ఆర్.యంపిలను మాత్రం గుర్తించలేదు, కరోనా ఉదృతంగా ఉన్న సమయంలో కూడా ఈ గ్రామ వైద్యులు ప్రజల ‘నాడీ” పట్టి వైద్యం అందించారు, మనుషులను మనుషులు చూసుకుంటేనె భయపడె ఈ పరిస్థితిల్లో కూడా వాళ్ల చెతస్కోప్ శబ్ధం ఎప్పుడు ఆగలేదు, అలాంటి వాళ్లకు కూడా ప్రభుత్వం కరోనా వారియర్స్ గా గుర్తించి వాళ్లకు టీకాలు వేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here