గ్రామపంచాయితి ఆస్తుల్లో వాటా కోసం బెదిరిస్తున్నారని తాహసిల్దార్ కు ఫిర్యాదు

0
165

తాజా కబురు రాయికల్: మండలంలోని కొత్త పేట గ్రామానికి చెందిన గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ రాజేశం మంగళవారం మండల తహసీల్దార్ మహేశ్వర్ కు ఫిర్యాదు చేశారు. వడ్డెర కాలనికి చెందిన వారు కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలోని, ప్రభుత్వ పాఠశాలలు, రాజరాజేశ్వర దేవస్థానం, మంచినీటి ప్లాంట్లో తమకు వాటా ఉందని, ఆరణి కుంట మత్తడిని జెసిబి తో తొలగించారని, గ్రామంలో ఎవరినైనా ఒకరిని చంపితే కానీ సమస్య పరిష్కారం కాదని బెదిరింపులకు పాల్పడుతున్నారని, మిషన్ భగీరథ నీటిని గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటుగా గ్రామస్తులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here