తాజా కబురు కోరుట్ల: రిపోర్టర్ పిట్టల రాజ్ కుమార్
కోటపాటి నరసింహనాయుడు జన్మదినం సందర్భంగా గురువారం ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియా సికిల్ సిల్ వ్యాధిగ్రస్తుల సహాయార్థం రక్తదాన శిబిరాన్ని కోరుట్ల పట్టణంలోని సినారె భవనం లో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సినారె భవన ఇంచార్జీలు రాజేందర్ నాయుడు, సుధాకర్, ప్రతిమ ఫౌండేషన్ మార్కెటింగ్ ప్రతినిధి అలీ, ఫౌండేషన్ ప్రతినిధులు వినయ్ కుమార్, రాంప్రసాద్, రజిని,విజయలక్ష్మి,రఘుపతి తదితరులు పాల్గొన్నారు.