కోరుట్లలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు, పాల్గోన్న జువ్వాడి కృష్ణరావు

0
48

తాజాకబురు కోరుట్ల : కోరుట్ల పట్టణంలో పట్టణ కాంగ్రెస్ అధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు రాహుల్ గాంధీ పుట్టినరోజు పురస్కరించుకుని కోరుట్లలో మున్సిపల్ అఫీస్ అవరణలో మున్సిపల్ కార్మికులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది…కరోనా మృత దేహాలకు సామజిక దృక్పథంతో కులమతాలకు అతీతంగా అంత్యక్రియలు నిర్వహించిన బిలాల్ పుర న్యూ యూత్ సొసైటీ వారికి సన్మానం చేశారు

వ్యక్తిగతంగా కరోనా సమయంలో అన్నదానం చేసిన ఎడ్ల రాజశేఖర్, ముహమ్మద్ సుజయిత్ తో పాటు కరోనా కల్లోలంలో ఉచితంగా ఆక్సిజన్ సరఫరా అందించిన దాతలు అయిన అస్లామ్, జునైధ్, ఫసి ఉద్దీన్, రక్త దానం చేసేలా యువకులను ప్రోత్సహిస్తున్న కటుకం గణేష్ తో పాటు సామాజిక కార్యక్రమాలను నిర్వహించిన పలువురిని సన్మానించారు.. కరొనాతో పోరాడి చనిపోయిన వారి కోసం 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు,ఈ కార్యక్రమాలల్లో జువ్వాడి కృష్ణరావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం రావు, కోరుట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొంతం రాజం,కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్,యూత్ కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గం అద్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నయీం, మ్యకల నర్సయ్య, మాజీ కౌన్సిలర్ సోగ్రాబి, మాజీ పట్టణ అద్యక్షుడు AR అక్బర్, ఎంబేరి సత్యనారాయణ, అశోక్ గడెల, కోట గంగాధర్, గంగాధరి శ్రీను, శ్రవణ్ కుమార్, దీపక్, తోడేటి శంకర్, ముహమ్మద్ నసీర్, సరికెళ్ళ నరేష్ లు పాల్గోన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here