తాజా కబురు భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకేరోజు ముగ్గురు గొత్తికోయ యువతులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.కనిపించకుండా పోయిన ఓ యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసుల కథనం ప్రకారం…అశ్వరావుపేట మండలం చెన్నాపురం కాలానికి చెందిన ముగ్గురు యువతులు ఈ నెల 16వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు.అయితే వారిని ఛత్తీస్ గడ్ కు చెందిన పంజా దేవా అనే వ్యక్తి 17వ తేదీన తీసుకెళ్లినట్టు ఓ యువతి తండ్రి హేమ్లా ఆదివారం రాత్రి పోలీసులకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశాడు.ఆ ముగ్గురు యువతులు 16వ,తేదీన గాండ్లగూడెంలోని ఓ వ్యక్తి ఇంటికి వెళ్లారని,ఆ మరుసటి రోజు దేవా వారిని తనతో తీసుకెళ్లినట్టు ఆ ఇంటి యజమాని తెలిపినట్టు హేమ్లా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. కాగా,కనిపించకుండా పోయిన ముగ్గురు యువతులు కూడా ఒకే గ్రామానికి చెందినవారు కావడం అందులో ఒకరు మైనర్ కూడా కావడం స్థానికంగా కలకలం రేపుతోంది.ఇక యువతులను తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు,అతడు ముగ్గురు యువతులను ఎందుకు తీసుకెళ్లాడు,వీరికి మావోయిస్టులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Latest article
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...
రాయికల్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు జోహార్ బాబా జగ్జీవన్ రామ్ ఆశయాలు వర్ధిల్లాలి...
విదేశీ జర్నలిస్టులు ముత్యంపేటకు ఎందుకు వచ్చారు… ?
గల్ఫ్ వలసలపై అధ్యయనం కోసం జగిత్యాల జిల్లాను సందర్శించిన విదేశీ జర్నలిస్టులు
తాజా కబురు డెస్క్: గల్ఫ్ వలస కార్మికుల ఆర్ధిక, సామాజిక జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇద్దరు విదేశీ జర్నలిస్టులు...