కొడిమ్యాల గ్రామస్తులకు సత్కారం, పోలీస్ లకు రివార్డులు

0
97

జగిత్యాల తాజా కబురు: గత మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని సరూర్ నగర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారి నాగభూషణంను కిడ్నాప్ చేసి, పథకం ప్రకారం హత్య చేసేందుకు తరలిస్తుండగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దొంగల మర్రి వద్ద సోమవారం రాత్రి ఎస్సై శివకృష్ణ తన సిబ్బందితో కలసి సమాయస్ఫూర్తి తో, చాకచక్యంగా వ్యవహరించి తనిఖీలలో నిఖిల్ సింగ్, సునీల్ పాటిల్, అజిజ్, బడా నాగరాజు అనే నలుగురు కిడ్నాపర్లను పట్టుకుని వ్యాపారి నాగభూషణం ప్రాణాలను కాపాడిన మాల్యల సిఐ కిషోర్, కొడిమ్యాల ఎస్ఐ శివకృష్ణ,కొడిమ్యాల పోలీస్ స్టేషన్ సిబ్బంది, డ్రైవర్లు అనీల్, గంగాధర్ లకు రివార్డ్ ను, పోలీస్ లకు సహకరించి, ధైర్య సహసాన్ని ప్రదర్శించిన కొడిమ్యాల గ్రామస్తులు చొక్కాల లక్ష్మినారాయణ, రంగినేని తిరుపతిలకు శుక్రవారం జిల్లా ఎస్పీ సింధు శర్మ శాలువతో సన్మానించి బహుమతులు అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here