కులం,మతం లేదంటూ..సర్టిఫికెట్‌ పొందిన తొలి మహిళ స్నేహా

0
238

కులం,మతం లేదంటూ..సర్టిఫికెట్‌ పొందిన తొలి మహిళ స్నేహా

స్పెషల్ ఫ్రతినిధి: శ్రీ గద్దె రత్నాకర్

చెన్నై:భారతదేశంలో కులం మతం అనే రెండు అంశాలు ఎప్పటినుంచో ఉన్నాయి వీటి వల్ల ఇండియాలో ఎన్నో కొట్లాటలు కూడా జరిగాయి. పుట్టుక తో మన కులం మతం నిర్ణయించబడుతుందని ప్రభుత్వ వ్యవస్థ చెబుతోంది. అలాంటి ఈ కులమతాలతో ఏం సాధించగలమని ఆమె అనుకుంది ఇలా అనుకుందో లేదో కులం మతం లేని జీవితం జీవించాలని నిర్ణయించుకుంది. వెంటనే ఆ ప్రయత్నంగా అడుగులు వేసింది. దాదాపు తొమ్మిదేళ్ల పాటు పోరాటం చేయగా చివరికి తనకు కులం, మతం లేదంటూ భారతదేశంలోనే ధ్రువీకరణ పత్రం పొందిన తొలి మహిళగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ మె ఎవరో కాదు తమిళనాడులోని వెల్లూరు జిల్లా తిరుపత్తూర్‌కు చెందిన స్నేహ పార్తీబారాజా అసలు ఆమె ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకో వాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.స్వతహాగా లాయర్ అయిన స్నేహకు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మానాన్నలు కులం మతం అనేది తెలియ కుండా పెంచారు. స్కూల్లో కాలేజీల్లో సైతం కులం పేరు నమోదు చేయలేదు. దీంతో కుల మతాలకు అతీతంగా ఆమె పెరిగింది. ఇక ఇదే సమయంలో కులం, మతం లేకుండా సర్టిఫికెట్ ఉంటే బాగుంటుందని స్నేహాకు అనిపించింది. ప్రభుత్వమే అలాంటి సర్టిఫికెట్‌ను ఇస్తే కుల నిర్మూల నకు మంచి ఆరంభం అవుతుందనుకుంది. కానీ ఆ సర్టిఫికెట్ పొందటం అంత సులువు కాదు దానికోసం ఆమె ఏకంగా తొమ్మిదేళ్లు పోరాటం చేయాల్సి వచ్చింది. మొదట్లో స్నేహాకు అధికారులు కులం లేదంటూ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. అయినా కూడా ఆమె పట్టు విడవలేదు. కలెక్టర్ వర కు వెళ్ళింది. అప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ మాదిరిగానే కులం, మతం లేదని సర్టిఫికెట్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించా రు. దానికి అనుగుణంగా అధికారులు విషయాలన్నింటిని పరిశీలించారు. అప్పటి సబ్ కలెక్టర్ తహసీల్దార్‌కు రికమండ్ చేయగా ఫిబ్రవరి 5, 2019న కులం మ తం లేదంటూ సర్టిఫికెట్‌ను స్నేహాకు అందజేశారు. దీంతో కులం మతం లేదన్న సర్టిఫికెట్ పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here