కలెక్టర్ గారు ఆడపిల్లల సొమ్ము తిన్న అధికారుల పై చర్యలేవి..?

0
33

-చేయని పనులు చేసినట్లు అందినకాడికి దోచేశారు.
-విచారణలో దోషులుగా తేలిన అధికారుల పై పి.డి యాక్ట్ పెట్టాలి.
భేటి బచావో భేటి పడావో నిధుల దుర్వినియోగం పై కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా.
బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి


కరీనగర్ తాజా కబురు: ఆడపిల్లల బంగారు భవితకై ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మ కంగా ప్రవేశపెట్టిన భేటి బచావో భేటి పడావో పథకం ప్రచారం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను అధికా రులు అందినకాడికి దోచేసినారని విచారణలో దోషులుగా తేలిన ఎలాంటి చర్యలు తీసుకోకపో వడంతో ఆంతర్యం ఏమిటో జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.భేటి బచావో భేటి పడావో ఆడ పిల్లలను రక్షించడా నికి,చదివించడానికి ప్రజల్లో అవగా హన కల్పించడానికి కేంద్ర ప్రభు త్వం రెండేళ్లు అనగా 2018-19, 2019-20 లకు పథకం అమలు కోసం మొత్తంగా రూ. 93.70 లక్షలు నిధులు కరీంనగర్ జిల్లాకు కేటాయించగా,ఇందులో నుండి రూ.71.14 లక్షలు నిధులు ఖర్చు చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి (డి.డబ్ల్యూ.ఓ) డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్ష న్ ఆఫీసర్ (డి.సి.పి.ఓ) లు లేనిది ఉన్నట్లు లెక్కల్లో చూపెట్టినారని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. గోడల పై వాల్ పెయింటింగ్ వేయ కున్న వేసినట్లు,మొబైల్ ప్రచార వ్యాన్ ప్రతి రోజు గ్రామాల్లో తిరగ కున్న తిరిగినట్టు,కరపత్రాలు ము ద్రించకున్న ముద్రించి పంచినట్టు, పోస్టర్లు,స్టిక్కర్లు ముద్రించకున్న ముద్రించి గోడలకు అతికేసిన ట్టు,కళ బృందాలు ప్రోగ్రాంలు చేయకున్నా చేసినట్లు,సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నా చేసినట్లు,ఆన్ లైన్ ప్రచారం కోసం యానిమేషన్ చిత్రాలు తీయకున్న తీసినట్లు,అలాగే వీటన్నిటి వీడి యోలు,ఫోటోలు తీయకున్న తీసినట్లు డిస్ట్రిక్ట్ ప్రైస్ కమిటీ (డి.పి.సి) అనుమతులు తీసుకో కుండానే కాకి లెక్కలు కాగితాల్లో జిల్లా సంక్షేమ అధికారి,డిస్ట్రిక్ట్ చైల్డ్ పోటెక్షన్ ఆఫీసర్ లు చూపెట్టి నిధుల దుర్వినియోగంకు పాల్ప డ్డారని దీని విచారణ అధికారైన మెప్మా పి.డి నివేదికలో పేర్కొని జిల్లా కలెక్టర్ కు డిసెంబర్ 29, 2020 రోజున సమర్పించి,తరు వాత జనవరి 27, 2021 రోజున సప్లిమెంటరీ రిపోర్టును అందిం చడం జరిగింది.నాలుగు నెలల తర్వాత జిల్లా కలెక్టర్ ఈ ఇద్దరి అధికారులకు మే 24, 2021 రోజున షోకాజ్ నోటీసులు ఇచ్చి అందులో ఏడు రోజుల వ్యవధిలో సమాధానం ఇవ్వాలని పేర్కొన్న పటికి నేటికి 18 రోజులు గడిచిన ప్పటికి జిల్లా కలెక్టర్ ఎందుకు చర్య లు తీసుకోకుండా తాత్సారం చేస్తు న్నారో ప్రజలకు సమాధానం చెప్పా లని బేతి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.కేంద్రం భేటి బచావో భేటి పడావో కు ఇచ్చిన నిధులను ఉద్దేశపూర్వకంగా అక్రమ పద్ధతు లో నిధుల దుర్వినియోగంకు పాల్పడి ఆడపిల్లల సొమ్ము కాజేసి,చేయని పనులను చేసినట్లు అందినకాడికి దోచుకున్న జిల్లా సంక్షేమ అధికారి పై,డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ లపై వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి అలాగే పి.డి యాక్ట్ నమోదు చేసే విధంగా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని,లేని పక్షంలో ఈ మొత్తం తతంగాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, దుర్వినియోగంకు గురైన నిధులను వారి వద్ద నుండే వసూలు చేసే విధంగా,అలాగే వారిద్దరిని విధుల నుండి తొలగించే విధంగా కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here