కరీనగర్ లో నైట్ బజార్ ఏర్పాటుకు చర్యలు:కలెక్టర్ కె.శశాంక

0
25

కరీనగర్ తాజా కబురు: కరీనగర్ స్మార్ట్ సిటీ లో భాగంగా ప్రజల అవసరాలకనుగుణంగా నైట్ బజార్ ఏర్పాటు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు.శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్మార్ట్ సిటీ లో భాగంగా నగరంలో వెండింగ్ జోన్ల ఏర్పాటు,నగర సుందరీకరణ పనులపై సమీక్ష సమా వేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరీంనగర్ స్మార్ట్ సిటీ లో ప్రజల ఆధునిక జీవన శైలికి అను గుణంగా అన్నిరకాల తినుబండారాలు లభించేలా 5-6 గుంటల స్థలంలో నైట్ బజార్ నిర్మించుటకు అనువైన స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు.నగరంలోని 14.5 కిలోమీటర్ల స్మార్ట్ రోడ్ల ఫుట్ పాత్ ల పై వీధి వ్యాపారాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఫుట్ పాత్ లు ఆక్రమణ గురికాకుండా టౌన్ ప్లానింగ్ అధి కారులు తొలగించాలని ఆదేశించారు.నగరంలో ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసి ఫుట్ పాత్రలపై ఏలాంటి వీధి వ్యాపారాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. నగ రంలో వీలైనన్ని ఎక్కువ వెండింగ్ జోన్ల నిర్మాణాలకు స్థలాలను గుర్తించాలని ఆదేశించారు.నగరంలో 3-4 ప్రాంతాలలో పండ్ల వ్యాపారులకు వెండింగ్ జోన్ లు నిర్మించి కేటాయించుటకు వీలుగా అనువైన స్థలాన్ని గుర్తించాలని అన్నారు. నగరంలో వీధి వ్యాపారుల కమిటీ ద్వారా వీధి వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.స్మార్ట్ సిటీ లో భాగంగా నగర సుందరీకరణ లో,ఆర్చీల నిర్మాణము,పార్కుల నిర్మాణం,వైకుంఠ దామల నిర్మాణం,వాకింగ్ ట్రాక్ ల నిర్మా ణం,పెయింటింగ్ పనులు,నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.నిర్మాణాలు పూర్తయిన వాటిని వెం టనే ప్రారంభించి,వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో నగర మేయర్ వై.సునీల్ రా వు,కమిషనర్ వల్లూరి క్రాంతి,ఎస్.ఈ కృష్ణారావు,ఈ.ఈ రామన్,డి సి పి సుభాష్,ఏ సి పి భానుచందర్,శ్రీనివాస్,స్మార్ట్ సిటీ టీం లీడర్ జగదీష్,డి ఈ మసూద్ అలీ,ఎఫ్ ఆర్ ఓ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here