కంటే కూతూర్నే కనాలి…..హ్యఫి డాటర్ దినోత్సవం
కూతురు,బిడ్డ,ఆడబిడ్డ,ఆడపడుచు,తల్లీ,చెల్లీ,సోదరి ఇలా ఎలా ఏ పేరుతో పిలిచిన పలికేది ఓ కూతురు గురించె,ఇరువై ఏళ్లు తల్లిదండ్రుల పొత్తిల్లల్లో పెరిగినా అమె ముక్కు మొహాం తెలియని ఓ వ్యక్తి చూపి వివాహాం చేసుకో అంటే జీవిత కాలం తోడుండె ఆ వ్యక్తి పై ఏ ఒక్క సందేహాం అడగకుండ తలవంచి తాళీ కట్టించుకుంటుంది,ఊరు తెలియదు ,గమ్యం తెలియదు,అవతలి వ్యక్తి వ్యక్తుత్వం తెలియదు, ఎలా ఉంటారో తెలియదు, కానీ అన్ని భరించి, అమ్మనాన్నల చెరనుండి, భర్త వద్ద బార్య బాధ్యతలతో అత్తింటికి వెళుతుంది,ఏదైన కొత్తచోటుకు వెళితెనే అవతలివాళ్లవద్ద ఇబ్బంది పడుతామే, అలాంటి ది జీవిత కాలం బతకాల్సిన భర్త ఇంటికి ఓ ఆలీగా అడుగెడుతుంది, కుటుంబ బారం, భర్త, పిల్లల బారం తన భుజస్కంధాలపై వేసుకొని కుటుంబాన్ని మోస్తుంది, అమ్మత్వం వచ్చాకా మరిన్నీ బాధ్యతలు స్వీకరించి తానే అన్నై నడిపిస్తుంది,ఒక ఇంటినుండి ఇరువై ఏళ్ల తర్వాత ఇంకో ఇంటికి ఎనుబై ఏళ్లు బతికేందుకు వెళుతున్న ఆ బిడ్డ భయపడదు, ఎందుకంటే “మహిళ” కాబట్టి, దైర్యం, ఓర్పు, నేర్పు,సహానం,అంకుటిత దీక్షా వాళ్ల ఆలోచనల్లో ఉంటాయి కాబట్టి, అటు అమ్మనాన్నలను, ఇటు అత్తమామలను సమపాళ్లల్లో చూసుకుంటు, భర్త,పిల్లలను బాధ్యతతో పెంచి ఆ కుటుంబానికె గౌరవం తీసుకోస్తుంది, తనకు పిల్లలు జన్మించాకా ఆ పిల్లల్లో జీవితకాలం అమ్మనాన్నలను చూసుకుంటుంది,అందుకె అమె మహిళ అయింది, అందుకె అమె మగువ అయింది, అందుకె ఆమె కూతురు అయింది, ఈ ప్రపంచాన్ని రక్షించె నారీ అయింది, అందుకె కంటే కూతుర్నే కనాలి…
