రాయికల్ తాజా కబురు : రాయికల్ పోలీసు స్టేషన్ పరిధిలో మండల కేంద్రంలోని అంగడిబజార్ వద్ద సోమవారం ట్రాఫిక్ మొబైల్ ఎగ్జిబిషన్ వాహనం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంటే, మరో వైపు ఎలాంటి భద్రత నియమాలు పాటించకుండా కనీసం తలకు రక్షణ కవచం కూడా పెట్టుకోకుండానే ఓ భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదం అంచున భవన నిర్మాణానికి చెందిన పనిని చేస్తున్న దృశ్యం తాజా కబురు కు చిక్కింది. ఎలాంటి భద్రత నియమాలు పాటించకుండా అంత ఎత్తులో పని చేయడం ప్రాణాలతో చెలగాటం అని, భవన నిర్మాణ యజమానులు కార్మికుల రక్షణ పై జాగ్రత్తలు పాటిస్తేనే నిర్మాణ పనులకు అధికారులు అనుమతివ్వాలని సామజిక వేత్తలు కోరుతున్నారు.