ఒరిస్సా వలస కార్మికుల బస్సు టికెట్ల కోసం ఆర్థిక సాయం అందించిన తహసిల్దార్
సహకారం అందించిన పాత్రీకేయులు
కోరుట్ల తాజా కబురు: పట్టణంలోని సాయిబాబా ఆలయం సమీపంలో జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న 25 మంది ఒరిస్సా వలస కార్మికులు,10 మంది చంటి పిల్లల సమాచారం అందుకున్న ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్, టీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శికారి రామకృష్ణ వరంగల్ వెళ్ళడానికి కార్మికుల ను సోమవారం బస్సు ఎక్కించడం జరిగింది.విషయం తెలుసుకున్న తహసీల్దార్ సత్యనారాయణ వెంటనే స్పందించి వలస కార్మికుల బస్సు టిక్కెట్ కోసం రూ.5000 లు పంపి వారి ఉదారత ను చాటుకున్నారు. ఆర్టీసి నాయకులు థామస్ రెడ్డి, కిషన్ రావులు బస్సు ను ఆపి సహాయం చేసారు. సమాచారం ఇచ్చిన జక్కని రమేష్ ,రాజ గంగారాం లు వలస కార్మికులకు పండ్లు,మంచి నీరు అందించి తలా ఒక సహాయం అందించి ఒరిస్సా కార్మికులను వరంగల్ బస్సు లో ఎక్కించి మానవత్వాన్ని చాటారు.