ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రాయికల్ లో అడ్డుకునె ప్రయత్నం చేసిన బీజెపి నాయకులను ముందస్తు అరెస్టు చేసిన పోలిసులు
తాజా కబురు జగిత్యాల: జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని బోర్నపల్లి గ్రామంలోని గోదావరి వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జి ని సందర్శించడానికి ఈ రోజు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాయికల్ మండలానికి ఏ హోదాలో వస్తున్నారని, తమకు తెలియజేయాలని కోరుతూ పట్టణంలోని ని శివాజీ చౌక్ వద్ద బీజెపి నాయకులు నిరసన తెలుపుతూ అడ్డుకునేందుకు ప్రయత్నించారు, విషయం తెలుసుకున్న పోలిసులు ముందస్తుగా బీజేపీ నాయకులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా కిసాన్‌మోర్చా నాయకులు కురుమ మల్లారెడ్డి, మండల అధ్యక్షులు అన్న వేణు, రాజశేఖర్ రెడ్డి సత్యం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.