మేడిపల్లి తాజా కబురు: భీమారం గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా గ్రామపంచాయతీ ద్వారానే బోరు బిల్లు చెల్లిస్తూ మంచినీటి ని సరఫరా చేసేవారని, కొంత కాలంగా ఆ బోర్లకు సంబంధించి విద్యుత్ బిల్లులు ప్రజలే కట్టుకోవలని ఆంక్షలు విధించారు. ప్రజలు ఓర్పుతో కొన్ని నెలలుగా ఆ కరెంటు బిల్లులు చెల్లిస్తూ వచ్చారు. ఇప్పుడున్న కరోన నేపథ్యంలో పనులు లేక చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కరెంటు బిల్లు కట్టలేకపోయారు. ప్రజలు కచ్చితంగా బిల్లులు కట్టాల్సిందేనని 5 రోజులక్రితం వార్డుల్లో బోర్ల కనెక్షన్లు తొలగించడంతో మహిళలు గ్రామస్థులు కలిసి సోమవారం రోడ్డెక్కి కాలి బిందెలతో రాస్తారోకో చేస్తూ ఇక మేము కరెంటు బిల్లు కట్టబోము మాకు గ్రామ పంచాయితీ నీళ్లు కావాలి, మిషన్ భగీరథ నీరు రావడం లేదు. గ్రామ సర్పంచ్ ఎన్నికల ముందు ప్రజలకు ఎలాంటి నీటి ఇబ్బందిలేకుండా చేస్తానని మేనిపెస్టోలో పెట్టి ప్రచారం చేసి ప్రజలను మోసం చేసారంటూ, ప్రజలకు అత్యవసరమైన నీటి సరఫరాను నిలిపివేయడంతో ఎన్నికల మేనిఫెస్టో ను అమలు చేయాలంటూ ప్రజా సమస్యలను తీర్చని పాలకులు ఎందుకని వాపోయారు.