ఈ రోజు బి.జే.వై.ఎం జిల్లా అధ్యక్షులు రెంటం జగదీష్ మెట్ పల్లిలో ఏమన్నారు…?

0
46

జగిత్యాల తాజా కబురు: మెట్ పల్లి పట్టణ కేంద్రంలో భారతీయ జనతా యువమోర్చా నగర ముఖ్య కార్యకర్తల సమావేశానికి గురువారం బి.జే.వై.ఎం జిల్లా అధ్యక్షుడు రెంటం జగదీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువమోర్చాను గ్రామా స్థాయి నుంచి బలోపేతం చేయాలని, ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పేద ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం దీపావళి వరకు అందించడం చాలా గొప్ప నిర్ణయం అని, సురక్ష భారత్ పథకం కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఈనెల 21 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సాహించాలని అన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనికేల నవీన్,బి.జే.వై.ఎం జిల్లా ఉపాధ్యక్షులు బైన ప్రశాంత్, జిల్లా అధికార ప్రతినిధి అరుణ్,జిల్లా కోశాధికారి రంజిత్ రెడ్డి,సుంకేట విజయ్,రమేష్ యదవ్,బోడ్ల నరేష్,అరిగేల అజయ్,శ్రీకాంత్, వినోద్,వెంకటేష్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here