జగిత్యాల తాజా కబురు: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఆర్టీసీ ఆధ్వర్యంలో జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రం లో సోమవారం ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ను రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువత ఈ డ్రైవింగ్ స్కూల్ ను సద్వినియోగం చేసుకోవాలని,నిష్ణాతులైన వారిచే డ్రైవింగ్ నేర్పిస్తారని, ఆర్టీసీని లాభాల బాటలో తెచ్చెందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. నియమాలు, నిబంధనలు ఎలా పాటించాలో వివరించారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నేత, జిల్లా కలెక్టర్ రవికుమార్,జిల్లా రవాణా శాఖ అధికారి అజ్మీర శ్యాంనాయక్ ,డిఎం,డివిఎం తదితరులు పాల్గొన్నారు.