అష్టదిగ్బందాన్ని అధికమించిన ఈటల-కర్ణుడి చావుకు వందకారణాలు,బీజేపి గెలుపుకు అన్నీ కారణాలే..

0
39

తాజాకబురు కరీంనగర్:

అష్టదిగ్బందాన్ని అధికమించిన ఈటల

కమలం వికసించింది..కారు పక్చరైంది..

రాజకీయాలు విచిత్రమైనవి,అప్పుడె అందలమెక్కిస్తాయి,అప్పుడే అట్టడుగుకు తొక్కేస్తాయి,అందుకె రాజకీయాలు ఎవరికి ఎప్పటికీ శాశ్వతం కాదని అంటుంటారు,ఇప్పుడు నిజంగా అలాగే జరిగింది,ఆరునెలల వరకు పార్టీకి కీలకమైన వ్యక్తిగా మన్ననలు పొందిన ఈటల పై టి.ఆర్.యస్ “వేటు” వేసింది,తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకమైన పాత్ర పోసించిన ఈటల,కేసిఆర్ ది గొప్ప భందం,ఎంతోకాలం కలిసి పని చేశారు,మరెంతోకాలం రాజకీయాల్లో ఉన్నారు,అప్పటి వరకు కలిసి ఉన్న వాళ్లు ఒక్కసారి విరోధులుగా మారిపోవటాన్ని ప్రజలు జీర్ణించుకోలేరు,ఈటల టి.ఆర్.యస్ నుండి బయటకు రావడం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యడం చకా చకా జరిగిపోయాయి,దాంతో హుజురాబాద్ ఉప ఎన్నికలు అనివర్యం అయ్యాయి,కొత్తగా పార్టీ పెడుదాడని కొందరు,కాంగ్రెస్ కు వెళుతాడని కొందరు అనుకునెలోపే ఈటల “బీజేపి” లోకి చేరిపోయారు,నాలుగు నెలలపాటు ఎన్నికల హాడవీడి,దేశవ్యాప్తంగా అందరి నజర్ …హుజురాబాద్ ఎన్నికలపై పడ్డాయి,చావో రేవో తేల్చుకోవల్సిన పరిస్థితులలో ఈటెల ఉండగా,ఈ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టి.ఆర్.యస్ పావులు కదిపింది,కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుండి టీ.ఆర్.యస్ లోకి వెళ్లడం,తర్వాత కొన్ని పరిణామాల తర్వాత ఈటలకు పోటిగా ఉద్యమ నాయకుడు హుజురాబాద్ నియోజకవర్గ స్తానికుడు అయిన గెల్లు శ్రీనివాస్ ను బరిలోకి దించేందుకు టి.ఆర్.యస్ నిర్ణయించుకొని అభ్యర్థి గా ప్రకటించింది…. అప్పటి నుండి మొదలైంది హుజురాబాద్ ఎన్నికల వేడి నాలుగు నెలలపాటు నిరంతరాయంగా కొనసాగింది,

అధికార పార్టీ అబాసుపాలు..

ఈ ఎన్నికలను ప్రేస్టేజ్ గా తీసుకున్న సీయం కేసీఆర్ సామవేద దండోపాయాలు అమలు చేశాడు,తాను స్క్రీన్ ప్లే ఇస్తే ఇక్కడ హారిష్ రావు దర్శకత్వం వహించాడు,ఓటర్లను ప్రలోభపెట్టడం నుండి,అధికారపార్టీ అన్నీ రకాల ఈటలను అష్టదిగ్బందం చేసింది,ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నుండి రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యే లు ఇతర నాయకులంతా హుజురాబాద్ లో జెండేశారు,ఓటర్లను ఆకర్శించేందుకు ఎన్నో టాస్క్ లు వేశారు,చివరి వరకు అన్నీ రకాల ప్రయత్నం చేసిన టి.ఆర్.యస్ ను ఎదుర్కోవడానికి ఈటెల ఎత్తులకు పై ఎత్తులు వేసి సఫలీకృతుడయ్యాడు,కౌశిక్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకత, దళితభందు రాదన్న ప్రచారం, డబ్బుల పంపకాల్లో ఓటర్ల మద్య జరిగిన గొడవలు,స్తానిక ప్రజప్రతినిధుల మద్య కొరవడిన సఖ్యత,ఈటలపై ఉన్న సానూభూతి ,గెల్లు శ్రీనివాస్ ను ప్రచారంలో హైలెట్ చెయకపోవటం వెరసి ఈటెల గెలుపు ఇవన్నీ కారణమయ్యాయి,కర్ణుడి చావుకు వందరకాల కారణాలు అయినట్టు,గెల్లు ఓటమికి కేసిఆర్ అతి ఉత్సాహం, మితిమీరిన ఆహాంబావం,అధికార దుర్వినియోగం అని ప్రజలు అనుకుంటున్నారు,ఎవరెన్నీచ్చిన ఓటర్లు తామనుకున్నవాళ్లకే వేసి గెలిపిస్తారు,డబ్బులు అన్నీ సందర్భాల్లో పని చెయ్యవని,అభిమానమే దీర్ఘకాలికంగా ఉంటుందని హుజురాబాద్ ఉప ఎన్నికలు తీర్పు ను ప్రజలు స్పష్టంగా ఇచ్చారని,ప్రజాస్వామ్యం ఇంకా బతికి ఉందనేది మేదావుల మాట…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here