రాయికల్ తాజా కబురు: మండలంలోని అల్లీపూర్ గ్రామంలో రెండు నెలల క్రింద నూతన డ్రైనేజీ నిర్మించగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఊరి శివారులో కలిసే డ్రైనేజీ 3మీటర్ల మేర కుంగిపోవటంతో సర్పంచ్ అత్తినేని గంగారెడ్డి పర్యవేక్షించి కాంట్రాక్టర్ తో తిరిగి మరమ్మత్తు చేయిస్తామని తెలిపారు.ఆయన వెంట స్థానిక వార్డు మెంబర్ సంజీవ్ రావు,నాయకులు బోగ నర్సయ్య,చిన్న గంగారాం,రాకేష్,రాజలింగం తదితరులు పాల్గొన్నారు.