జగిత్యాల తాజా కబురు : అరవింద్ ధర్మపురి యువసేన ఆధ్వర్యంలో స్థానిక మడలేశ్వర ఆలయంలో బుధవారం బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జి ముదిగంటి రవీందర్ రెడ్డి నిత్యావసర వస్తువుల పంపిణి చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు సూచించిన నిబంధనలను పాటించాలన్నారు. ఇండ్ల నుండీ బయటకు వెళ్ళకుండా స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరవింద్ యువసేన సభ్యులు జంబుక శివ, సుంచు సురేశ్, కోటగిరి వినయి,జిల్లా మహిళా అధ్యక్షురాలు అరవ లక్ష్మి, అసెంబ్లీ కన్వీనర్ లింగంపెట శ్రీనివాస్, కౌన్సిలర్లు గుర్రం రాము, ప్రధాన కార్యదర్శి అముధ రాజు, గట్టపెల్లు జ్ఞానీ ,జిట్టవెని అరుణ్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.