అపూర్వ సమ్మేళనం.. పాఠాలు నేర్పిన గురువులకు సిల్వర్ జూబ్లీ వేడుకల్లో వందనం..

0
39

అపూర్వ సమ్మేళనం.. పాఠాలు నేర్పిన గురువులకు సిల్వర్ జూబ్లీ వేడుకల్లో వందనం..

తాజాకబురు జగిత్యాల: ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి, చదువులమ్మ చెట్టు నీడలో ఓనమాలు దిద్ది, బాల్యం అనే మధుర జ్ఞాపకానికి చిరునామాగా నిలిచె పాటశాలను ఆ’పూర్వ”విద్యార్థులు మరచిపోలేదు, ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్న కూడా విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుకు విధేయతను ప్రదర్శిస్తూ సన్మానం చేశారు..

వాసవితో జీవితానికి నాంది…

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ప్రముఖ పాఠశాలగా ఖ్యాతి తెచ్చుకున్న వాసవి స్కూల్‌.. పాతికేళ్ల ప్రయాణం పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థులు సిల్వర్‌ జూబ్లీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆరంభం నుంచి వాసవి పాఠశాలలో పని చేసిన ఉపాధ్యాయులను ఆహ్వానించారు. మెట్‌పల్లి చైతన్యనగర్‌లో పాతికేళ్ల కింద వాసవి ట్రస్టు ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ పాఠశాల వేలాది మందికి బలమైన పునాది వేసింది. ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల్లో చాలా మంది నేడు అద్భుతంగా రాణించి.. ఎన్నో ఉన్నత స్థానాల్లో నిలిచారు. సిల్వర్‌ జూబ్లీ సందర్భంగా నాడు తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను సత్కరించారు పూర్వ విద్యార్థులు. వాసవి అనే ఒక గొడుగు తమకు నేర్పిన జీవిత పాఠాలు ఎప్పటికీ మరిచిపోలేమని, ఉపాధ్యాయులకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు పూర్వ విద్యార్థులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here