తాజా కబురు జగిత్యాల:జిల్లా అదనపు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కె. దక్షిణా మూర్తి బుధవారం తెల్లవారుజామున 05:30 గంటలకు కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా కు చికిత్స అందిస్తుండగా అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో చనిపోయారు.ఆయన అంతక్రియలు పోలీస్ అధికారిక లాంఛనాలతో కరీంనగర్ లోని స్మశాన వాటిక లో నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ విబి కమలాసన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రవి, అడిషనల్ కలెక్టర్ రాజేశం, అదనపు ఎస్పీ దక్షిణామూర్తి గారి చిత్రపటానికి పుష్పగుచ్చం సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఆర్.ఐ మల్లేశం గారి ఆధ్వర్యంలో పోలీసుల గౌరవ వందనం గా గాల్లోకి కాల్పులు జరిపి నివాళులర్పించారు.ఆయన మరణం పట్ల జిల్లా కలెక్టర్ రవి ,అడిషనల్ కలెక్టర్ రాజేశం జిల్లా ఇంచార్జ్ ఎస్పీ వి.బి కమలసన్ రెడ్డి,తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
1989 బ్యాచ్ ఎస్సై ద్వారా పోలీస్ శాఖలోకి వచ్చిన దక్షిణా మూర్తి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎస్సై, సిఐ, డీఎస్పీ గా పనిచేశారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ గా పని చేస్తున్నారు.